రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలకృష్ణ అప్పట్లో 'లక్ష్మీ నరసింహా' చిత్రం కోసం వేసిన స్టెప్పులకి!
Fri Jun 06, 2025 09:22 Cinemas.202506064520.jpg)
బాలకృష్ణ అప్పట్లో 'లక్ష్మీ నరసింహా' చిత్రం కోసం వేసిన స్టెప్పులకి.. కొత్తగా పాట కట్టి ఈ సినిమాని రీరిలీజ్ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2004లో విడుదలైన చిత్రమిది. బాలకృష్ణ హీరోగా నటించగా, జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేశ్ నిర్మాత. 21 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి 4కే హంగుల్ని జోడించి మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా `మంచినీళ్లు తాగినోడు మామూలోడు...' అంటూ సాగే కొత్త పాటని సినిమాకి జోడిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించారు. స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాటని విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ “21 ఏళ్ల తర్వాత ఈ సినిమాని మళ్లీ విడుదల చేస్తున్నామని తెలిసినప్పుడు, నందమూరి అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. అప్పట్లో చిత్రీకరించిన ఓ పాటని ఇందులో కలపలేదు. రీరిలీజ్లో ఎలాగైనా ఆ పాటని జోడించాలనుకున్నాం. దాని కోసం వెతికితే ఫిల్మ్ దొరికింది కానీ, అందులో ఆడియో వినిపించలేదు. ఆ ఫిల్మ్ లోని స్టెప్పులకు తగ్గట్టుగా కొత్తగా పాట చేయాలనిపించి చంద్రబోస్, భీమ్స్క పంపించా. దీన్నొక సవాల్ గా తీసుకుని వాళ్లు నాటి సన్నివేశాలకి తగ్గట్టుగా పాట సిద్ధం చేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వస్తున్న ఈ సినిమాని అభిమానులు మళ్లీ మళ్లీ చూసి ఆస్వాదిస్తారన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #balayya #cinema #rerelease #trend #movies #telugu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.